|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:28 AM
విలక్షణ నటుడు ఆర్. మాధవన్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత సిద్ధాంతాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన ఆఫ్‌స్క్రీన్ ఇమేజ్‌కు సంబంధించి సూపర్‌స్టార్ రజనీకాంత్, తన స్నేహితుడు అజిత్ కుమార్‌ల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని ఆయన వెల్లడించారు. నటనకు అవసరం లేనప్పుడు తాను జుట్టుకు రంగు వేసుకోనని, సహజంగా ఉండేందుకే ఇష్టపడతానని స్పష్టం చేశారు.ఓ తాజా ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ, "రజనీకాంత్ గారు ఆఫ్‌స్క్రీన్‌లో చాలా సాధారణంగా ఉంటారు, కానీ తెరపై అద్భుతాలు చేస్తారు. నా స్నేహితుడు అజిత్ కూడా అంతే. వారిని చూసి నేను నేర్చుకున్నది ఏమిటంటే, మన ఆఫ్‌స్క్రీన్ ఇమేజ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను నాలా సౌకర్యంగా ఉంటాను," అని తెలిపారు. తనకు ఎవరితోనూ పోటీ లేదని, తన సామర్థ్యాలతో తనను తాను సవాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు.అవార్డుల గురించి ప్రస్తావిస్తూ, వాటి కంటే ప్రేక్షకుల అభిమానమే తనకు గొప్పదని మాధవన్ అన్నారు. "నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా అవార్డులు రాలేదని కొందరు అనొచ్చు. కానీ నాకు వాటితో పనిలేదు. చిత్ర పరిశ్రమలో నా కన్నా గొప్ప నటులు ఎందరో ఉన్నారు. వారికి కూడా సరైన గుర్తింపు దక్కలేదు. దిలీప్ కుమార్ లాంటి మహానటుడికే జాతీయ అవార్డు రాలేదు" అని గుర్తుచేశారు.ఇన్నేళ్ల కెరీర్‌లో తనకు మంచి పాత్రలు లభించడమే సంతోషాన్నిస్తుందని మాధవన్ తెలిపారు. ఇటీవల ఆయన నటించిన 'ఆప్ జైసా కోయి' చిత్రం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 40 ఏళ్ల పెళ్లికాని యువకుడి పాత్రలో ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
Latest News