|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 01:48 PM
బాలీవుడ్ నటీనటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్న వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి, పట్టు వస్త్రాలు, తీర్థ ప్రసాదం అందజేశారు. ఆగస్టు 29న విడుదల కానున్న జాన్వీ, సిద్ధార్థ్ నటించిన ‘పరమ్ సుందరి’ సినిమా హిట్టు అవ్వాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Latest News