|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 12:15 PM
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు వల్ల విచారణ, సాక్షులపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం పేర్కొంది. నిందితులు ఎంతటి వాళ్లైనా.. చట్టానికి అతీతులేం కాదని జస్టిస్ జేబీ పార్దీవాలా అన్నారు.
Latest News