|
|
by Suryaa Desk | Thu, Aug 14, 2025, 10:55 AM
రూ.60 కోట్లు మోసం చేశారని నటి శిల్పా శెట్టి దంపతులపై ఫిర్యాదు.. కేసు నమోదు. షాపింగ్ ఫ్లాట్ ఫాం బెస్ట్ టీవీకి నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న సమయంలో డబ్బులు ఇచ్చానని ఆరోపించిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త. 2015-23 మధ్యలో వ్యాపారంలో భాగంగా రూ.60.48 కోట్లు ఇచ్చానని.. 2016లో నటి శిల్పా శెట్టి తనకు హామీ కూడా ఇచిందన్న దీపక్ కొఠారి. శిల్పా శెట్టి తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేయగా.. అనంతరం దివాలా తీసిన షాపింగ్ ఫ్లాట్ ఫాం బెస్ట్ టీవీ కంపెనీ. రాజీనామా విషయాన్ని బయట చెప్పలేదని, తన దగ్గర తీసుకున్న డబ్బులను సొంతం కోసం వాడుకున్నారని నటి శిల్పా శెట్టి దంపతులపై ఫిర్యాదు చేసిన దీపక్. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జుహు పోలీసులు
Latest News