|
|
by Suryaa Desk | Sat, Jul 19, 2025, 10:22 PM
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తొలి పాన్ ఇండియా చిత్రం థియేటర్లలో విడుదలై నెలరోజులైనా పూర్తి కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో శేఖర్ కమ్ములకు కొంత రిలీఫ్ లభించినట్టే. ఇకపై ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా శ్రమించాల్సిన అవసరం లేకపోవచ్చు.
ఒక్కో సినిమాకు మూడు సంవత్సరాల సమయం తీసుకునే శేఖర్ కమ్ముల ఇప్పుడు ఒకేసారి రెండు స్క్రిప్టులు సిద్ధం చేస్తున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 2000లో డాలర్ డ్రీమ్స్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఈ సెన్సిబుల్ డైరెక్టర్ గత 25 ఏళ్లలో ముప్పై సినిమాలు తీయకుండా కేవలం 10 సినిమాలకే పరిమితమయ్యాడు.అయితే ఈసారి మాత్రం శేఖర్ తన స్పీడ్‌ను పెంచినట్లు కనిపిస్తోంది. మధ్యలో బ్రేక్ లేకుండా వరుసగా రెండు కథల పనిలో ఉన్నాడట. ఈ రెండు ప్రాజెక్టులలో ఒకటి ఆయనకు బాగా కలిసొచ్చిన జానర్ అయిన ప్రేమకథ అని సమాచారం.ప్రస్తుతం 'కుబేర' చిత్రంతో శేఖర్ పాన్ ఇండియా కంటెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నానీతో కూడా ఒక సినిమా ప్లాన్ చేశాడట. కథ కూడా నానీకి వినిపించాడని, అయితే నానీ ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టుల వల్ల అతనితో సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడతుందని తెలుస్తోంది.ఈ గ్యాప్‌లో శేఖర్ కమ్ముల ఓ న్యూ ఏజ్ లవ్‌స్టోరీ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోన్నట్టు సమాచారం. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్‌స్టోరీ వంటి చిత్రాలతో ప్రేమకథల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ మరోసారి తన స్ట్రాంగ్ జానర్‌దగ్గరికి తిరిగి వస్తున్నాడు.ఇక నానీతో తీసే సినిమాలో కూడా పాన్ ఇండియా రేంజ్ లక్ష్యంగా ఉంటే ఆశ్చర్యం లేదు, ఎందుకంటే నాని ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయనతో శేఖర్ లవ్‌స్టోరీ చేయాల్సి వస్తే అది కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కే అవకాశం ఉంది. అసలు ఈ ప్రేమకథ పాన్ ఇండియా అవుతుందా లేక తెలుగు ప్రేక్షకులకే పరిమితమవుతుందా అన్నది ఆసక్తికర అంశం.
Latest News