![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 07:23 AM
డాకు మహారాజ్: టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల 'డాకు మహారాజ్' లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులని భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జులై 13న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాంధిని చౌదరి, సత్య, ఊర్వశి రౌటేలా మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.
సంక్రాంతికి వస్తున్నాం: టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ యొక్క అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో జులై 13న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. అనిల్ రవిపుడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ కేపర్ లో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ క్రింద దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Latest News