![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 07:28 AM
లక్కీ బాస్కర్: మాలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ యొక్క తెలుగు చిత్రం 'లక్కీ బాస్కర్' బహుళ భాషల్లో విడుదలై విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా 100 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజగా ఇప్పుడు ఈ చిత్రం జులై 13న ఉదయం 8 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో రామ్‌కి, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, రిత్విక్, సచిన్ ఖేడేకర్ మరియు పి. సాయి కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
RRR: టాలీవుడ్ స్టార్ నటులు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'RRR' మళ్లీ ముఖ్యాంశాలు చేసింది. మాస్టర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు చిన్న స్క్రీన్లపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జులై 13, 2024న ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా ఛానల్ లో మధ్యాహ్నం 1 గంటకి ప్రసారం కానుంది. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలివియా మోరిస్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ బిగ్గీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Latest News