|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:43 PM
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన డాన్ మరియు డాన్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచాయి. మూడవ విడతలో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో విక్రాంత్ మస్సెయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కృతి సనాన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజా నివేదిక ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఈ చిత్రం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, ఫర్హాన్ అక్తర్ అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్‌లతో పాటు యాక్షన్ పార్ట్‌లో పనిచేయడంలో బిజీగా ఉన్నారు.
Latest News