|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:41 PM
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. బాలీవుడ్‌లో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఎంత హాట్‌గా కనిపించినప్పటికి బయట మాత్రం చాలా హోమ్లీగా కనిపిస్తోంది ఈ అమ్మడు. 'ఆషికి 2' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. బాలీవుడ్‌లో శ్రద్ధా కపూర్‌కు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్‌కు లేదంటే అమ్మడు రేంజ్ ఎలా ఉందో అర్థం చే సుకోవచ్చు. ఇటీవలే 'స్త్రీ-2' సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా 'స్త్రీ-2' నిలిచింది. ఇక బాలీవుడ్‌లో ప్రస్తుతానికి అత్యధిక రెమ్యూనిరేషన్ అందుకునే హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ గుర్తింపు దక్కించుకుంది. ఇక అమ్మడుకు ఎఫైర్లు కూడా తక్కువేం కాదు. గతంలో ఆదిత్యరాయ్ కపూర్‌తో శ్రద్ధా కపూర్ రిలేషన్‌లో ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత తన చిన్ననాటి మిత్రుడుని శ్రద్ధా కపూర్ ప్రేమిస్తోందని, అతన్నే వివాహం చేసుకుంటుందనుకున్నారు. ఈ రిలేషన్ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్‌తో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందనే రూమర్లు వినిపించాయి. ఇటీవల శ్రద్ధా కపూర్ రచయిత రాహుల్ మోడీతో రిలేషన్‌షిప్‌లో ఉందనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇస్తున్నారు. తాజాగా వీరు ఫ్లైట్‌లో కలిసి ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. చూస్తుంటే ఈ జంట వెకేషన్‌కు వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు. వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Latest News