|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 02:50 PM
వెంకీ కుడుముల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన రాబిన్హుడ్ చిత్రం మార్చి 28, 2025న విడుదల అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోవటంలో ఫెయిల్ అయింది మరియు బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు మరియు జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ సినిమా జీ తెలుగు ఛానల్ లో జూన్ 22న సాయంత్రం 6 గంటల కి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించింది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టెలికాస్ట్ లో 2.15 టీఆర్పీని నమోదు చేసినట్లు సమాచారం. దేవదత్త నాగే ఈ చిత్రంలో పవర్ఫుల్ విలన్ గా నటించారు. ఈ చిత్రంలో నితిన్ కి జోడిగా శ్రీలీల నటిస్తుంది. రాబిన్హుడ్ లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెలా కిషోర్, గోపి, లాల్, శుభలేఖ సుధాకర్, సుదర్శన్ మరియు ఇతర ప్రతిభావంతులైన నటులతో పాటు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించారు. మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్ర సంగీతాన్ని జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచారు.
Latest News