![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 05:38 PM
సమంత రూత్ ప్రభు- కీర్తి సురేష్ స్నేహం గురించి చెప్పాల్సిన పని లేదు. `మహానటి` చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించగా, సమంత జర్నలిస్టు పాత్రలో అద్భుతంగా అభినయించింది. ఆ ఇద్దరి నట ప్రతిభకు ప్రపంచం ఫిదా అయిపోయింది. పరిశ్రమలో నాటి నుంచి వారి స్నేహం చాలా ప్రత్యేకమైనదిగా మారింది. అంతేకాదు ఆ ఇద్దరూ హైదరాబాద్ లో ఉన్నా, చెన్నైలో ఉన్నా కలిసే జిమ్ చేస్తుంటారు. జిమ్ యోగా సెషన్స్ కి కలిసే ఎటెండవుతున్నారు. క్లబ్బు, పబ్బు, రెస్టారెంట్, దుబాయ్ పార్టీ, లేదా ఏదైనా ఎగ్జోటిక్ బీచ్ లొకేషన్ లో కలిసి ఎంజాయ్ చేయాలనే ఆలోచన కూడా వారికి ఎప్పుడూ ఉంది. తాజాగా మరోసారి జిమ్ లో కసరత్తులు చేస్తూ, రెస్టారెంట్ లో రుచికరమైన విందు కోసం ఎదురు చూస్తూ ఈ జోడీ కనిపించారు. కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. అభిమానులు ఈ ఫోటోలు చూసిన వెంటనే వారిని `క్యూటీస్` అని ముద్దుగా పిలుచుకున్నారు. చాలా మంది వ్యాఖ్యల విభాగంలో హార్ట్ ఈమోజీలను షేర్ చేసారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. కీర్తి తదుపరి తెలుగు ఒరిజినల్ చిత్రం `ఉప్పు కప్పురంబు`లో కనిపించనుంది. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ విచిత్రమైన సామాజిక వ్యంగ్య చిత్రాన్ని ఎల్లనార్ ఫిల్మ్స్ పతాకంపై రాధిక లావు నిర్మించారు. ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి తదితరులు నటించారు. సమంత రూత్ ప్రభు ఇటీవల విడుదలైన తెలుగు హర్రర్ కామెడీ చిత్రం `శుభం`తో నిర్మాతగా అరంగేట్రం చేసింది. సొంత బ్యానర్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయ కొంతం కీలక పాత్రలు పోషించారు.
Latest News