![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 29, 2025, 05:30 PM
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అందుకే అదే జోనర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం సినిమాను అనిల్ రావిపూడి రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో ఆమెను నటింపజేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్ కోసం ఆమె హాజరు అయ్యేందుకు ఓకే చెప్పింది. సాధారణంగా నయనతార ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటుంది అనే విషయం తెల్సిందే. ఈ సినిమాతో మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటాను అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూపించడంతో పాటు, ఆయన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసే విధంగా ఆకట్టుకునే కామెడీతో సినిమాను రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా ఈ సినిమా ఆన్ లొకేషన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెట్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి షాట్ వివరీస్తూ ఉండగా, చిరంజీవి దాన్ని చేసి చూపిస్తున్నాడా అన్నట్లుగా ఈ వీడియో ఉంది. చిరంజీవి వింటేజ్ లుక్ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఈ సినిమాలో ఆయన మ్యానరిజంలు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి. సాధారణంగానే దర్శకుడు అనిల్ రావిపూడి తెగ వాడేస్తాడు. అలాంటిది ఈ సినిమా కోసం ఆయన వాడకం ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజా వీడియో ను చూస్తూ ఉంటే తప్పకుండా చిరంజీవి ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉందని, అంతే కాకుండా ఆకట్టుకునే విధంగా కామెడీతో మరో కామెడీ ఎంటర్‌టైనర్‌ను అనిల్ రావిపూడి అందించబోతున్నాడు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. చిరంజీవి విశ్వంభర సినిమా కంటే ముందు ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆయన ఈ సినిమా కోసం ఏకంగా రెండు నుంచి మూడు వారాల డేట్లను ఇచ్చేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. వెంకటేష్ ఇటీవలే ఒక షెడ్యూల్‌లో పాల్గొన్నాడు. ఆయన మళ్లీ ఒక షెడ్యూల్‌లోనూ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు అలియాస్ బుడ్డోడు రేవంత్ సైతం నటిస్తున్నాడు. ఈ వీడియోలో బుడ్డోడిని సైతం చూడవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుడ్డోడి కామెడీ ఓ రేంజ్‌లో హిట్ అయింది. అందుకే ఈ సినిమాలో అతడిని రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2026 సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ ఖాయం అంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Latest News