![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 28, 2025, 03:51 PM
1997 ఎపిక్ వార్ ఫిలిం "బోర్డర్"కి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ "బోర్డర్ 2" చిత్రీకరణ ప్రారంభమైంది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ మరియు అహన్ శెట్టి నటించిన ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో దిల్జిత్ దోసాంజ్ ప్లేస్ లో అమ్మీ విర్క్ నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయంపై మేకర్స్ నుండి క్లారిటీ రానుంది. ఈ యాక్షన్, డ్రామా మరియు దేశభక్తిని కలిగి ఉన్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, JP దత్తా మరియు నిధి దత్తా నిర్మించారు. ఈ చిత్రం జనవరి 23, 2026న విడుదల కానుంది. ఈ సీక్వెల్ గ్రాండ్ సినిమాటిక్ అనుభూతిని అందిస్తూ ఐకానిక్ ఒరిజినల్ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. గుల్షన్ కుమార్ మరియు టి-సిరీస్‌తో సహా పవర్‌హౌస్ నిర్మాణ బృందంతో "బోర్డర్ 2" బ్లాక్‌బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.
Latest News