|
|
by Suryaa Desk | Mon, Jun 16, 2025, 03:43 PM
హీరోయిన్ అమలాపాల్ నటించిన ఆమె మూవీ మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. తమిళ్‌లో ఆడై పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా నటించి మెప్పించారు. అయితే, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తాను న్యూడ్‌గా నటించిన సన్నివేశాలపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ... "నేను నగ్నంగా నటించే సన్నివేశాన్ని 15 మంది పురుషుల సమక్షంలో చిత్రీకరించారు. అది నాకు సవాలుగా అనిపించినప్పటికీ, మూవీలో ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం నటించాను. ఈ సీన్ కోసం నేను దాదాపు 20 రోజుల పాటు నగ్నంగా నటించాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక, ఈ చిత్రం విడుదల సమయంలో ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడింది. అది కొంత బాధను కలిగించింది" అని అమలాపాల్ చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలాఉంటే.. తెలుగులో ఆమె అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో నటించిన విషయం తెలిసిందే. బన్నీతో 'ఇద్దరమ్మాయిలతో', చెర్రీ 'నాయక్' సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటించారు. ఇక, తమిళంలో ఆమె నటించిన తొలి చిత్రం 'మైనా'తో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు.
Latest News