![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 07:44 PM
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సికందర్' ఈద్ స్పెషల్‌గా విడుదల అయ్యింది. A.R.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్ డ్రామా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం మే 25న ప్రసారానికి అందుబాటులోకి రానుంది. రష్మిక మాండన్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించారు, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ మరియు ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. సాజిద్ నాడియాద్వాలా నిర్మించిన ఈ సినిమాకి ప్రీతం సంగీతం మరియు సంతోష్ నారాయణన్ స్కోరు అందిస్తున్నారు.
Latest News