![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 04:28 PM
హిందీ చిత్ర పరిశ్రమలో లెగసీ ఫ్రాంచైజీల పునరుద్ధరణ పెరిగింది. గదర్ 2 బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. దాని విజయాన్ని అనుసరించి ప్రతి స్టూడియో వారి ప్రాజెక్ట్ సీక్వెల్ ని ప్రకటించడం ప్రారంభించింది. ఇప్పుడు సన్నీ డియోల్ ఫ్రాంచైజీకి తిరిగి రావడంతో 'బార్డర్ 2' మొదటి ప్రధాన ప్రకటన వచ్చింది. తాజాగా ఇప్పుడు సన్నీడియోల్ ఉత్తరాఖండ్ ఫిల్మ్ కౌన్సిల్ ను కలుసుకున్నారు. రాష్ట్రంలో ఈ సినిమా కోసం యుద్ధ దృశ్యాలను చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశం డెహ్రాడూన్ లోని హల్డువాలా ప్రదేశంలో జరిగింది. ఇక్కడ బోర్డుర్ 2 కోసం పెద్ద ఎత్తున వార్ సెట్ ఏర్పాటు చేయబడింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నారు. భారతీయ చలనచిత్రంలో భారీ కాన్వాస్‌పై ఈ చిత్రం మౌంట్ చేయబడింది మరియు డియోల్‌తో పాటు ధావన్‌ను ప్రధాన పాత్రలో నటించటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బోర్డర్ 2 చిత్రీకరణను మూవీ మేకర్స్ ప్రారంభించారు. ఈ చిత్రం 2026 జనవరి 23న విడుదల కానుంది.
Latest News