|
|
by Suryaa Desk | Wed, May 21, 2025, 03:26 PM
ఐకాన్ స్టార్ల్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మరియు దిల్ రాజులకు 'ఆర్య' సినిమా ప్రత్యేక చిత్రం. ఈ చిత్రం 2004లో విడుదలై తెలుగు సినిమాలో ప్రేమ కథలను పునర్నిర్వచించింది మరియు దీనిని హృదయపూర్వకంగా ప్రేక్షకులు స్వీకరించారు. దీని సీక్వెల్ 'ఆర్య 2' అంచనాలను అందుకోలేదు కానీ ఇప్పటికీ ఫ్యాన్ బేస్ ని కలిగి ఉంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఏస్ నిర్మాత దిల్ రాజు ఆర్య 3 అనే శీర్షికను ఫిల్మ్ ఛాంబర్ లో నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఉన్న పెద్ద ప్రశ్న, అల్లు అర్జున్ మరియు సుకుమార్ తిరిగి ఈ ప్రాజెక్ట్ ని చేస్తారా లేదా దిల్ రాజుకు టైటిల్ కోసం ఇతర ప్రణాళికలు ఉన్నాయా? అని ఊహాగానాలు ఉన్నాయి. అల్లు అర్జున్ యొక్క ప్రస్తుత లైన్ అప్ ని చూస్తే అట్లీ తో ఒక చిత్రం, త్రివిక్రమ్‌తో ఒక పౌరాణిక ప్రాజెక్ట్, మరియు సుకుమార్‌తో పుష్ప 3 ఉన్నాయి. కనీసం 2-3 సంవత్సరాలలో నటుడు ఫుల్ బిజీ అని స్పష్టమైంది. కాబట్టి దిల్ రాజు తన మేనల్లుడు ఆశిష్ రెడ్డి రాబోయే చిత్రం కోసం ఈ ఐకానిక్ ఫ్రాంచైజ్ టైటిల్‌ను ఉపయోగించాలని యోచిస్తున్నాడు అని సమాచారం. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది.
Latest News