|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 08:41 PM
వెంకటేశ్, రానా కలిసి నటించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. 2023లో వచ్చిన ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్, అసభ్య పదజాలం వల్ల ఫ్యామిలీ ఆడియన్ష్ దూరమయ్యారు. ఇప్పుడు ‘రానా నాయుడు: సీజన్ 2’ విడుదల తేదీ ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్’లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సీజన్ 1కు వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్టు వెంకటేశ్ గతంలో తెలిపారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీజన్ 2లో బోల్డ్ కంటెంట్ తగ్గించినట్టు చెప్పారు.బాలీవుడ్‌లో ఏ సెలబ్రిటీకి సమస్య వచ్చినా పరిష్కరించే ఏకైక వ్యక్తి రానా నాయుడు (రానా). భార్య, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటాడు. ఓ రోజు జైలు నుంచి బయటకు వస్తాడు రానా తండ్రి నాగా నాయుడు (వెంకటేశ్). రానాకు తండ్రి అంటే పడదు. అతడి వల్ల తన కుటుంబంలో సమస్యలు వస్తాయని ఆందోళనగా ఉంటాడు. మరి, నాగా నాయుడు వచ్చిన తర్వాత రానా జీవితంలో చోటు చేసుకున్న మార్పులేంటి? ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?అసలు తండ్రీకొడుకుల మధ్య వైరం ఎందుకు ఏర్పడింది? నాగా నాయుడి కొడుకులైన తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్), జఫ్ఫానాయుడు (అభిషేక్ బెనర్జీ) పరిస్థితి ఏంటి? తదితర ఆసక్తికర అంశాలతో సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ ‘రానా నాయుడు 1’ రూపొందించారు.
Latest News