|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 08:33 PM
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలించిన కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమెతో పాటు తరుణ్‌రాజ్‌కు కూడా బెయిల్ లభించింది. అయితే డీఆర్ఐ ఇంకా ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో రన్యారావు ప్రస్తుతం జైలులోనే కొనసాగనున్నారు. ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగుతోంది.2 లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించ వద్దని, దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల కూడదని , భవిష్యత్తులో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనవద్దని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ 60 రోజుల్లోగా ఛార్జిషీట్‌ను దాఖలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వీరు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు , షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపు లోకి తీసుకుని రూ. 12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Latest News