|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:40 PM
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు.మరోవైపు నెట్టింట తారక్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత ఎస్కేఎన్ సైతం ఎన్టీఆర్ కు బర్త్ డే విష్ చెస్తూ ఫోటోస్ షేర్ చేశారు. ఇక ఆ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందులో ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపిస్తుంది. చేయి బెణికిందేమో.. అందుకే అలా పట్టీ వేసుకున్నాడా.. ? లేదంటే చేయి పట్టేసిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్కేఎన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Latest News