|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 09:08 PM
వైభవ్ గురించి ఒక తప్పుడు వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదే విషయంలో బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత, వైభవ్ సూర్యవంశీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ ఫొటోల్లో వైభవ్ ను ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్లు చూపించారు. దీంతో కొందరు నెటిజన్లు ప్రీతి జింటాపై విమర్శల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. అంతేకాకుండా 14 ఏళ్ల ఆటగాడికి అలా హాగ్ ఇవ్వడం ఏంటని కొన్ని వెబ్ సైట్లు కూడా నెగెటివ్ కథనాలు ప్రచరించాయి. తాజాగా ఇదే విషయంపై ప్రీతి జింటా స్పందించారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడమేంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.'ఇది మార్ఫింగ్ చేసిన ఫోటో. తప్పుడు వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారు. ఆఖరి న్యూస్ ఛానెల్స్ కూడా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఉపయోగించి వాటిని గా చూపిస్తున్నాయి. వీటిని చూసి నేను ఆశ్చర్యపోయాను' అని ఎక్స్ (ట్విట్టర్) లో రాసుకొచ్చింది ప్రీతి జింటా. దీంతో ఈ వైరల్ ఫొటోపై ప్రీతి జింటా స్వయంగా స్పందించింది.నిజం చెప్పాలంటే మే 17న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా వైభవ్ సూర్యవంశీని కలిసింది. అక్కడ వారిద్దరూ జస్ట్ కరచాలనం చేసుకుని మాట్లాడుకున్నారంతే. అంతే కానీ ప్రీతి జింటా వైభవ్‌ను హగ్ చేసుకోలేదు. కానీ కొందరు నెటిజన్లు వారిపై మార్ఫింగ ఫొటోలు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేశారు.
Latest News