|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:36 AM
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న భారీ మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మార్చి 5, 2026న సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ గ్లింప్స్ ద్వారా చిత్రంలోని మిస్టికల్ ప్రపంచాన్ని పరిచయం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'లాపతా లేడీస్' నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
Latest News