|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 08:00 PM
శ్రుతి హాసన్ 'ఇల్లు' అనే భావనపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇల్లు అంటే మ్యాప్‌లోని ఒక ప్రదేశం కాదని అది ఒక లోతైన వ్యక్తిగతమైన ఫీలింగ్ అని ఆమె అన్నారు. పలు భాషా చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన అనుభవంతో తనకు ఇల్లు అనే భావనపై అవగాహన పూర్తిగా మారిపోయిందని శ్రుతి తెలిపారు.ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ నాకు ఇల్లు అంటే అస్సలు భౌగోళిక ప్రదేశం కాదని గ్రహించాను. చెన్నైకి వెళ్లినప్పుడు నాకు అనంతమైన ప్రేమ, సౌకర్యం లభిస్తాయి. ముంబైలో మరో రకమైన ప్రేమను పొందుతాను. హైదరాబాద్‌లో పనిచేస్తున్నందున ఇక్కడ భిన్నమైన అనుబంధం ఉంటుంది అని వివరించారు. ప్రతి నగరం తనకు ప్రత్యేకమైన అనుభూతిని పంచిందని ఆమె చెప్పారు.అయితే కాలక్రమేణా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించానని ఆమె తెలిపారు.నన్ను ఎక్కడైనా వదిలేసినానేను సౌకర్యాన్ని వెతుక్కోగలను. ఒక ప్రదేశం, అక్కడి ప్రజలు, సంస్కృతి గురించి తెలుసుకుని, అందులో నాకు నచ్చిన దాన్ని నా సొంతం చేసుకుంటాను. నిజానికి నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అని శ్రుతి పేర్కొన్నారు. నాలో నాకు సౌకర్యంగా లేనప్పుడు, సొంత ఇంట్లో ఉన్నా సరే అసౌకర్యంగానే అనిపిస్తుందని అన్నారు.నాకు నేనే ఇల్లు అనే భావన నా మెదడులో బలంగా నాటుకుపోయింది. జీవితంలో దేన్నైనా ఎదుర్కోవడానికి ఇది నాకు గొప్ప భద్రతను, భరోసాను ఇచ్చింది. ఈ ఆలోచన స్వార్థంగా అనిపించినా, నాకు బాగా పనిచేసింది. నాన్న తప్ప మరే వ్యక్తి నాకు ఇల్లులా సౌకర్యవంతంగా అనిపించలేదు అని శ్రుతి స్పష్టం చేశారు.
Latest News