|
|
by Suryaa Desk | Sat, Feb 21, 2026, 07:01 PM
తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చిన వరలక్ష్మి ఆ తర్వాత ఇండస్ట్రీలో తన కాళ్లపై తాను నిలబడింది. ఇప్పుడు దర్శకురాలిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. డైరెక్టర్ గా తన మొదటి చిత్రం ‘సరస్వతి’తో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సార్ నా గురువు, మెంటార్, గైడ్. ఆయన కారణంగానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయనే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. ఇండస్ట్రీలో అమ్మాయిలు సర్వైవ్ అవడం చాలా కష్టమని, వారికి సపోర్ట్ ఇవ్వాలని ఆమె కోరింది.కనబడకుండా పోయిన కూతురి కోసం ఒక అమ్మ ఎంత దూరం వెళుతుందో చూపించే కథాంశంతో 'సరస్వతి' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరలక్ష్మితో పాటు ప్రియమణి, ప్రకాశ్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. దోసా డైరీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Latest News