|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:45 PM
కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'కిష్కీందపురి' చిత్రం సెప్టెంబర్ 12న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఇటీవలే జీ5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం మంచి స్పందనను పొందుతోంది. తాజాగా ఇప్పుడు కిష్కింధపురి యొక్క తమిళం, కన్నడ మరియు మలయాళం వెర్షన్లు జీ5లో అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటాయని సమాచారం. ప్రస్తుతానికి హిందీ వెర్షన్ గురించి ఎటువంటి అప్‌డేట్ లేదు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ సినిమాలో సుదర్శన్, ఆది, శాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, ప్రేమ, శ్రీకాంత్, మర్ఖండ్ దేశ్ పండేయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.
Latest News