|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:42 PM
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు రిషబ్ టాండన్ (32) హఠాన్మరణం చెందారు. ఆయన మరణానికి గుండెపోటు కారణమని, ఢిల్లీలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దురదృష్టకర ఘటన జరిగిందని ఆయన సన్నిహితుడు ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.ముంబైకి చెందిన రిషబ్ టాండన్ 'ఫకీర్' అనే పేరుతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన ఆలపించిన 'ఇష్క్ ఫకీరానా' అనే పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటతోనే ఆయనకు 'ఫకీర్ సింగర్' అనే ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, నటుడిగా పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 'ఫకీర్ – లివింగ్ లిమిట్‌లెస్', 'రష్నా: ది రే ఆఫ్ లైట్' వంటి ప్రాజెక్టులలో నటించి తన నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Latest News