|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:40 PM
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న ప్రేమను మరోసారి వినూత్నంగా చాటుకున్నారు. తన ఇంటికి విచ్చేసిన 'బాస్' కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనాన్ని తయారు చేయించి, ఆయనపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. దీపావళి పండుగ సందర్భంగా బండ్ల గణేశ్ తన నివాసంలో సినీ పరిశ్రమ ప్రముఖుల కోసం ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవికి ఆయన ఇచ్చిన గౌరవం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.దీపావళి వేడుకల కోసం బండ్ల గణేశ్ తన ఇంటికి సినీ పరిశ్రమలోని ఎందరో ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీకి విక్టరీ వెంకటేశ్, సిద్దు జొన్నలగడ్డ, హీరో శ్రీకాంత్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు సహా పలువురు తారలు, దర్శకులు, నిర్మాతలు హాజరై సందడి చేశారు. అయితే, ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. చిరంజీవి కారు దిగగానే బండ్ల గణేశ్ స్వయంగా ఎదురెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన్ను చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు.అందరిలోనూ చిరంజీవికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ, ఆయన కోసం ముందుగానే సిద్ధం చేయించిన సింహాసనం లాంటి కుర్చీలో ఆయన్ను కూర్చోబెట్టారు. ఈ అరుదైన సందర్భానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ విషయంపై బండ్ల గణేశ్ తన ఆనందాన్ని పంచుకున్నారు. "మా బాస్ చిరంజీవి గారు ఇంటికి వస్తున్నారని ఆప్యాయంగా ఆ సింహాసనం తయారు చేయించుకున్నాను. ఆ స్థానంలో ఆయన కూర్చున్న ఆ క్షణం నా మనసు ఉప్పొంగిపోయింది. లవ్ యూ అన్నయ్య" అని ఆయన సోషల్ మీడియా ద్వారా తన భావాలను వ్యక్తం చేశారు.
Latest News