|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:38 PM
ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా దంపతుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. వీరిద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. పరిణీతి ఆదివారం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా వారు ఓ అందమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. "వాడొచ్చేశాడు! మా అబ్బాయి... అతను లేని జీవితాన్ని ఇప్పుడు ఊహించుకోలేకపోతున్నాం. మా చేతులు నిండాయి, మా హృదయాలు మరింతగా నిండాయి. మొదట మేమిద్దరం ఉన్నాం, ఇప్పుడు మాకు సర్వస్వం లభించింది" అంటూ భావోద్వేగభరితమైన నోట్‌ను రాసుకొచ్చారు. ఈ వార్త తెలియగానే అభిమానులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Latest News