|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:10 PM
హీరోయిన్ కేథరిన్ థెరీసా మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో అవకాశం దక్కించుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకరవర ప్రసాద్‌గారు’ చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే పేరు ప్రచారంలో ఉన్నా అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల సెట్‌లోని ఫోటోలో కనిపించడంతో ఆమె పాత్రపై స్పష్టత వచ్చింది. ఈమె పాత్రపై నెటిజన్లు మీడియాలో ఆరా తీస్తున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజకు జోడిగా నటించారు.
Latest News