|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 06:27 PM
టాలీవుడ్ యువ నటుడు మాస్ క దాస్ విశ్వక్ సేన్ డిఫరెంట్ జానర్ ఎంటర్‌టైనర్స్‌తో బిజీగా ఉన్నాడు. తన హిట్ చిత్రాలైన ఫలక్‌నుమా దాస్ మరియు దాస్ కా దమ్కీకి సీక్వెల్స్‌తో బిజీగా ఉన్నాడు. జాతిరత్నాలు ఫేమ్ కెవి.అనుదీప్ దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. ఈ చిత్రానికి 'ఫంకీ' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ చిత్రంలో కాయాడు లోహర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్, ఈ సినిమా యొక్క టీజర్ ని అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఫంకీకి సంగీతం జిబ్రాన్ మరియు తనిష్క్ బాగ్చి అందించారు మరియు సినిమాటోగ్రఫీని రిచర్డ్ కె ప్రసాద్ నిర్వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.
Latest News