|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 05:07 PM
బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ తన వృత్తిపరమైన జీవితంపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, తన భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్‌తో కలిసి పనిచేయడం గురించి ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. వ్యక్తిగత సంబంధాలను, వృత్తిని కలపడం ఎల్లప్పుడూ సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడుతూ, "జీవిత భాగస్వామితో గానీ, స్నేహితులతో గానీ పనిచేయడం చూడటానికి సులభంగా అనిపించవచ్చు. కానీ, వృత్తిపరంగా అది ఎప్పుడూ మేలు చేయకపోవచ్చు" అని పేర్కొన్నారు. తన భార్య కరీనాతో కలిసి తాను 'ఎల్‌వోసీ కార్గిల్', 'ఓంకార', 'ఏజెంట్ వినోద్' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, ఈ విషయంలో తన అభిప్రాయం మారలేదని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత బంధాలను వృత్తితో కలపడం వల్ల కొత్త సవాళ్లను స్వీకరించే తపన తగ్గిపోయి, కెరీర్ ఎదుగుదలపై ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Latest News