|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 04:45 PM
స్టార్ హీరోయిన్ సమంత, తన రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. ఈ నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు ఆమె స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో భాగంగా, ఓ నెటిజన్ ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు సమంత స్పందించారు. "మీ అందరి అనుమానాలకు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. ఈ నెలలోనే ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. చాలా సంతోషంగా ఉంది. నా రీఎంట్రీ గురించి అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ ఈ సినిమాతోనే సమాధానం చెబుతాను" అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Latest News