|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 04:42 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి కారణం క్రికెట్ దేవుడిగా అభిమానులు పిలుచుకునే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ స్వయంగా ఆయన బ్యాటింగ్‌ను ప్రశంసించడమే. డాలస్ నుంచి దుబాయ్ వెళ్లే విమానంలో సచిన్‌తో కలిసి ప్రయాణించే అరుదైన అవకాశం తమన్‌కు లభించింది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సోమవారం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో సచిన్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసిన తమన్, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "క్రికెట్ దేవుడు, లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో కలిసి ప్రయాణిస్తున్నాను. డాలస్ నుంచి దుబాయ్ వరకు ప్రయాణంలో మంచి సమయం గడిపాను. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మ్యాచ్‌లలో నా బ్యాటింగ్ క్లిప్స్‌ను ఆయనకు చూపించాను. అది చూసిన మాస్టర్.. ‘మీకు అద్భుతమైన బ్యాట్ స్పీడ్ ఉంది’ అని అన్నారు. ఇక నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. బహుశా త్వరలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావచ్చు" అని తమన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Latest News