|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 03:40 PM
'రాకింగ్ స్టార్' మంచు మనోజ్ చాలా కాలం తర్వాత 'మిరాయ్' సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ అనే పాత్రలో ఆయన చేసిన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.'మనోజ్ లాంటి నటుడిని ఇంతకాలం తెరపై చూడలేకపోయాం' అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక అద్భుతమైన నటుడు విలన్ పాత్రను చేస్తే అది హీరోను కూడా డామినేట్ చేస్తుందనేందుకు మనోజ్ పాత్రే ఉదాహరణ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ మనోజ్ ప్రదర్శించిన అద్భుతమైన నటన, భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. 'మిరాయ్'లో మనోజ్ వన్ మ్యాన్ షో చేశారని, ఆయన పాత్రతో సినిమా చూస్తున్నంతసేపు ప్రయాణించామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం మంచు మనోజ్ కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని, ఆయన ఆశించిన విజయాన్ని, పేరు ప్రఖ్యాతులను తీసుకొస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Latest News