|
|
by Suryaa Desk | Mon, Sep 08, 2025, 03:38 PM
టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా 'మిరాయి' అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా పై భారీ అంచానాలు ఉన్నాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న జయరామ్ పోస్టర్ ని విడుదల చేసారు. అంతేకాకుండా ఈ సినిమాలో నటుడు అగస్త్య ముని అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రితికా నాయక్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, జయరామ్ మరియు శ్రియా సరన్ కూడా కీలక పాత్రలలో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ పాన్ ఇండియన్ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుంది. గౌరీ హర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News