|
|
by Suryaa Desk | Sat, Sep 06, 2025, 10:00 PM
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ (OG Movie), డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో రూపొందుతోంది. కథానాయికగా ప్రియాంక మోహన్, ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మి నటించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజ్ కానుంది.చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. ‘ఓజీ’ పోస్ట్-ప్రొడక్షన్ పనులలో భాగంగా, ఆయన నేపథ్య సంగీతాన్ని సమకూర్చే ప్రక్రియలో ఉన్నారు. ఇందుకోసం జపాన్ వాద్య పరికరం కోటోను ఉపయోగించి ప్రత్యేక బీజీఎం క్రియేట్ చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో కూడా పంచుకున్నారు.మునుపటి ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అగ్ని తుపాను ఎంత భీకరంగా ఉంటుందో, ఓజాస్ గంభీర ధైర్యసాహసాలు ఎలాంటివో పాటతోనే చూపించనున్నారు. పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ సాహిత్యానికి ఉత్సాహం, ఉద్వేగాన్ని మేళవించి శింబు పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.హాలీవుడ్ స్థాయిలో తమన్ సంగీతం అందించినట్లు అభిమానుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News