|
|
by Suryaa Desk | Sat, Sep 06, 2025, 12:07 PM
అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ'పై మైత్రీ మూవీ మేకర్స్‌కు సమస్యలు తలెత్తాయి. సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. తన పాత పాటలను అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ రూ.5 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లోగా పాట తొలగించాలని నోటీసు ఇచ్చారు. నిర్మాతలు హక్కుదారుల అనుమతి తీసుకున్నామని చెబుతున్నా, అసలు యజమాని ఎవరనేది చెప్పలేదని ఇళయరాజా న్యాయవాదులు ఆరోపించారు. కేసు సెప్టెంబర్ 8న విచారణకు రానుంది.
Latest News