|
|
by Suryaa Desk | Fri, Sep 05, 2025, 02:21 PM
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై రూ.60 కోట్లు మోసం కేసులో ముంబై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీకి సిద్ధమయ్యారు. 2015-23లో బెస్ట్ డీల్ టీవీ పేరుతో వ్యాపార విస్తరణ నెపంతో వ్యాపారవేత్త దీపక్ కొఠారి నుంచి డబ్బు తీసుకుని వ్యక్తిగత ఖర్చులకు వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. శిల్పా ఇచ్చిన హామీని నిలబెట్టలేదని ఆయన ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ తరచూ విదేశాలకు వెళ్తుండడంతో లుకౌట్ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News