|
|
by Suryaa Desk | Fri, Sep 05, 2025, 08:34 AM
2005 కామెడీ హిట్ చిత్రం నో ఎంట్రీకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'నో ఎంట్రీ 2' టైటిల్ తో ఇటీవలే ప్రకటించంబడింది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ మరియు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన కథనాయకులుగా నటించనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అనీస్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా 2026 డిసెంబర్ 25న విడుదలకి సిద్ధం అవుతున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News