|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 07:45 PM
బాలీవుడ్ నటుడు ఆశిష్ కపూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక హౌస్ పార్టీలో యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని పుణెలో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. ఆగస్టులో 24 ఏళ్ల యువతి తన స్నేహితుడు ఏర్పాటు చేసిన పార్టీకి వెళ్లింది. అక్కడ కొందరు వ్యక్తులు పానీయంలో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారం చేశారని ఆరోపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Latest News