|
|
by Suryaa Desk | Thu, Sep 04, 2025, 03:13 PM
ప్రముఖ నటుడు అథర్వా మురళి రాబోయే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'టన్నెల్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావన్య త్రిపాఠీ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అశ్విన్ కకుమను ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, శక్తి సారావనన్ సినిమాటోగ్రాఫర్, మరియు కలైవనన్ ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. తెలుగు వెర్షన్ రాజు నాయక్ లాచురం ప్రొడక్షన్స్ ద్వారా విడుదల అవుతుంది.
Latest News