|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 03:43 PM
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో ప్రముఖ నటి కల్యాణి ప్రియదర్శియన్ సూపర్ హీరో యూనివర్స్‌లో చిత్రం లోక్ చాప్టర్ 1: చంద్రతో ప్రేషకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తెలుగులో కొత్త లోక చాప్టర్ 1: చంద్ర అనే టైటిల్ తో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ ని మేకర్స్ సెప్టెంబర్ 3న హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో సాయంత్రం 5 గంటల నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సక్సెస్ మీట్ కి ప్రధాన నటీనటులు కల్యాణి ప్రియదర్శియన్, నెల్సన్ మరియు నిర్మాత దుల్క్కుర్ సల్మాన్ హాజరుకానున్నారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ ఈవెంట్ కి స్టార్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రేమలు నటుడు నాస్లెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం జేక్స్ బెజోయ్ యొక్క సంగీత స్కోర్‌ను కలిగి ఉంది. దుల్క్కుర్ సల్మాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శాండీ మాస్టర్, టోవినో థామస్, సన్నీ వేన్ మరియు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలలో నటించారు.
Latest News