|
|
by Suryaa Desk | Wed, Sep 03, 2025, 03:29 PM
మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని కలిసింది. భేటీ అనంతరం సోషల్ మీడియాలో మంత్రి పోస్టు పెట్టారు. "120 మంది టీమ్‌తో కెన్యాలో షూట్ చేస్తున్నారు. మసాయి మరా నుంచి అంబోసెలి వరకు అద్భుత దృశ్యాలను చూపించబోతున్నారు. 120 దేశాల్లో రిలీజ్ అవుతోన్న ఈ చిత్రం 100 కోట్ల మందికి చేరుతుందని గర్వంగా చెబుతున్నాం" అని ముసాలియా ముదావాది పేర్కొన్నారు.
Latest News