|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 04:08 PM
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'SSMB-29' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక షాకింగ్ కామెంట్స్ చేసింది. ''ఇండస్ట్రీలో పూరిషాదిపత్యం ఎక్కువగా ఉంది. సెట్‌లో మేము హీరోలతో సమానంగా కష్టపడినా.. పారితోషికం విషయం సమానత్వం ఎక్కడా కనిపించదు.హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు పదో వంతు కూడా ఇవ్వరు. ఇండస్ట్రీలో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. నటీమణులు సమాన వేతనం అడిగినా ఫలితం లేదు. అది కేవలం ఒక సంప్రదాయంగా మారిపోయింది. షూట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో కూడా హీరోనే డిసైడ్ చేస్తాడు. మేము తొందరగా వెళ్లినా సరే ఆయన వచ్చిన తర్వాతే మొదలవుతుంది. కానీ హాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటి సిస్టమ్ లేదు. హీరోలకు సమానంగా వేతనం లభిస్తుంది. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది'' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
Latest News