|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:50 PM
నందమూరి కుటుంబంలో ప్రస్తుతం రెండు వేర్వేరు గ్రూపులు ఉన్నాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎవరైనా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – ఇది ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవం. ఒక వర్గం నారా కుటుంబానికి మద్దతుగా ఉండగా, మరో వర్గం జూనియర్ ఎన్టీఆర్‌ను ఆదరిస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ వైపు ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్ తప్ప మరెవ్వరూ నిలబడటం లేదు అనేది ఓపెన్ సీక్రెట్. గతంలో వీరి మధ్య విభేదాలు సైలెంట్‌గా సాగినా, ఇప్పుడు మాత్రం కొంతమంది నేరుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల మీద మాట్లాడకుండా, తాను చేస్తున్న పనిలో మునిగిపోయి ఉన్నాడు. కళ్యాణ్ రామ్ కూడా అంతే పద్ధతినే పాటిస్తున్నారు.ఇప్పటికీ టీడీపీ లోని కొందరు నేతలు ఎన్టీఆర్ మీద పరోక్షంగా, ఏదో రీతిలో కామెంట్లు చేయడం, ప్రొవోకేట్ చేయడం చూస్తున్నాం. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూలో ‘వార్ 2’ సినిమాను ఆపేయాలంటూ చేసిన వ్యాఖ్యలు, అలాగే ఎన్టీఆర్ తల్లి పై తక్కువ స్థాయి మాటలతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సోషల్ మీడియా నుంచీ గ్రౌండ్ లెవెల్ వరకు తీవ్రంగా స్పందించారు. ఇదే సమయంలో నారా రోహిత్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ‘వార్ 2’ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి.తన కొత్త సినిమా ‘సుందరాకాండ’ విడుదలకు ముందు ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ:"కూలీ సినిమాను చూశాను. కొన్ని సన్నివేశాలు బాగా వచ్చాయి. ఓవరాల్‌గా ఓకే అనిపించింది. కానీ వార్ 2 చూళ్దామన్న ఆసక్తి నాకు ఏం కలగలేదు. నా స్నేహితులు కూడా ఏ సినిమా చూళ్దాం అని అడిగితే – కూలీ సినిమా చూడమని సలహా ఇచ్చా" అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుంచి తీవ్ర స్పందన వచ్చింది."ఇంకా రెండు సినిమాలు రిలీజ్ అయ్యి వారం కూడా కాలేదు. అలాంటి టైంలో ఒకటి బాగుంది, ఒకటి చూడలేను అనేలా మాట్లాడటం సెలబ్రిటీగా తగుతుందా?","చూడలేదు అంటే చూడలేదు అనడమే చాలు కదా, ఎందుకు అలా ప్రత్యేకంగా తక్కువ చూపిస్తున్నట్టు చెప్పాలి?" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Latest News