|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 08:35 PM
సోషల్ మీడియా వేదికగా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్న నటి పూనమ్ పాండే .. నిత్యం ఏదో ఒక ఇష్యూతో వైరల్ అవుతూ ఉంటుంది.ఇక ఇప్పటికే తన విడాలకుపై స్పందించిన ఈ అమ్మడు.. మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. 'రెండేళ్ల నుంచి ఒంటరిగా ఉన్నప్పటికీ చాలా సంతోషంగా ఉన్నాను. పెళ్లి జీవితం నాకు కలిసి రాదేమో.ఏదైతేనే ఇప్పుడైతే నా ఫ్యామిలీ, కెరీర్‌తో సంతోషంగా ఉన్నాను. మళ్లీ పెళ్లి చేసుకోవాలని కూడా నాకు అనిపించడం లేదు.. అసలు పెళ్లి అనే పేరు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అసలు పెళ్లి అనేది నా జీవితంలో జరిగిన అతి పెద్ద తప్పుగా నేను భావిస్తున్నా..ఆ తప్పుకు తప్పా మరి దేనికి నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు' అని తెలిపింది. కాగా.. 2020లో తన ప్రియుడు సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. అతడితో గోవాకు హనీమూన్‌కు కూడా వెళ్లింది. ఆ టైమ్‌లో తన భర్త సామ్ తనను వేధిస్తున్నాడని, కొడుతున్నాడని మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.
Latest News