|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 04:09 PM
స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఫౌజీ మూవీ నుంచి ప్రభాస్ లుక్‌కు సంబంధించి ఓ ఫొటో లీక్ అయింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ సగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
Latest News