|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 11:30 AM
ఎన్నికల్లో ఓట్ల చోరీపై పోలింగ్ సీసీటీవీ ఫుటేజీలు బయట పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ.. మహిళల ప్రైవసీ కారణంగా సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వలేదని తెలిపింది. తాజాగా ఈసీ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘మీరు పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు. మీరు చెప్పే సాకులపై మాకు ఆసక్తి లేదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Latest News