|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 08:21 PM
నెలసరి సమయంలో సాధారణ మహిళలే కాకుండా మహిళా నేతలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని నటి, ఎంపీ కంగన రనౌత్ తెలిపారు. ‘సినిమాల్లో కారవాన్ సౌకర్యం ఉండటంతో షూటింగ్‌లో పెద్ద సమస్య ఉండదు. కానీ పొలిటికల్ టూర్స్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒకేసారి 12 గంటలపాటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరైన టాయిలెట్ సౌకర్యం ఉండదు. నెలసరి సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకోవడమే మంచిదే’ అని కంగన సూచించారు.
Latest News