|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:31 PM
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 'త్రిబాణధారి బార్బరిక్' చిత్రం విడుదల కానున్నట్లు ఆ చిత్ర బృందం ప్రకటించింది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో, వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా విశేషాలను పంచుకున్నారు.సత్యరాజ్ మాట్లాడుతూ.."ఈ సినిమాలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో కథే ప్రధాన పాత్ర. దర్శకుడు మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ అసలైన బాణాలు. 70 ఏళ్లు దాటినా కొత్త పాత్రలు చేయాలనే నా కోరికను ఈ 'బార్బరిక్' చిత్రం నెరవేర్చింది. నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమా విడుదల కావడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి" అని అన్నారు.
ఉదయభాను మాట్లాడుతూ.. "సినిమాలకు దూరంగా లేను, నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఈ చిత్రంలో నాకు ఓ ఛాలెంజింగ్ పాత్ర ఇచ్చారు. మోహన్ కథ చెప్పినప్పుడు ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. ఇలాంటి చిత్రాలు మన భాషలో ఎందుకు రావు? అనుకునేవారిని ఈ సినిమా ఆశ్చర్యపరుస్తుంది. సత్యరాజ్ లాంటి గొప్ప నటుడితో పనిచేయడం మా అదృష్టం" అని చెప్పారు.వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ... "ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. నేను చిరంజీవి అభిమానిని. ఆయన పుట్టినరోజున మా సినిమా విడుదల కావడం ఆనందంగా ఉంది" అని తెలిపారుదర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ... "మాకు మీడియానే 'బార్బరిక్'. మా పాటలకు మంచి స్పందన వచ్చింది. మా బాస్ చిరంజీవి పుట్టినరోజున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఇది క్లారిటీ, కమిట్‌మెంట్, కంటెంట్ ఉన్న సినిమా. అందరూ చూసి సక్సెస్ చేయండి" అని కోరారు.
Latest News